తెలంగాణ‌లోని ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు అల్ట‌ర్‌.. ఆరు పేపర్లు.. అరగంట అదనపు స‌మ‌యం

Minister Sabita Indrareddy said that the tent exams will be conducted in 6 papers.తెలంగాణ రాష్ట్రంలోని ప‌దో త‌ర‌గ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2022 6:34 AM GMT
తెలంగాణ‌లోని ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు అల్ట‌ర్‌.. ఆరు పేపర్లు.. అరగంట అదనపు స‌మ‌యం

తెలంగాణ రాష్ట్రంలోని ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసే విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ ఏడాది ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు ఆల‌స్యంగా ప్రారంభ‌మైన కార‌ణంగా.. ఈ ఏడాది ఆరు పేప‌ర్ల‌తోనే ప‌ది పరీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చెప్పారు. 70 శాతం సిల‌బ‌స్‌తోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అంతేకాకుండా ప‌రీక్ష స‌మ‌యాన్ని మ‌రో అర‌గంట పాటు పెంచుతున్న‌ట్లు చెప్పారు.

బుధవారం పాఠశాల విద్య సంచాలకుల కార్యాలయంలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది మేలో జ‌ర‌గ‌నున్న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌బ్భందీ ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. ప‌రీక్ష స‌మ‌యం పెంపు( 2.45ని॥ల పరీక్షా సమయం ఉండగా అరగంట పెంపుతో మొత్తం 3.15ని॥ల పాటు ), 70 శాతం సిల‌బ‌స్ వంటి ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యాల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి ప‌రీక్ష‌లు స‌జావుగా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

వ‌చ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఈలోగా ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమ బోధనపై శిక్షణను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగుపరిచేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించామని, పాఠశాలల్లో ఈ మేరకు మార్పు కనిపించాలన్నారు. ఇక టెట్‌ పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

Next Story
Share it