తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఫీజులపై కీలక అప్డేట్

Key Update on Telangana Inter Student Fees. తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు పై ఓ క్లారిటీ వచ్చింది.

By M.S.R  Published on  13 Nov 2022 1:00 PM GMT
తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఫీజులపై కీలక అప్డేట్

తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు పై ఓ క్లారిటీ వచ్చింది. నవంబర్ 14 నుంచి 30వ తేదీలోపు ఫీజులు స్వీకరించనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్‌ వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్‌ రెగ్యులర్‌ విద్యార్థులు రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్‌ గ్రూపు విద్యార్థులు ప్రాక్టికల్‌ పరీక్షలకు అదనంగా రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్‌ విద్యార్థులు మాత్రం రూ.710 చెల్లించాలి. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 2 నుంచి 6వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 8 నుంచి 12 వరకు , రూ.వెయ్యి ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 14 నుంచి 17 వరకు చెల్లించాలి. రూ.2000 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 19 నుంచి 22 తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం 100 శాతం సిలబస్‌ అమలవుతుందని, పాతపద్ధతిలోనే పరీక్షలను నిర్వహిస్తామని ఇప్పటికే ఇంటర్మీడియేట్ బోర్డు స్పష్టం చేసింది. హాజరు మినహాయింపు పథకం కింద విద్యార్థులు రూ.500 ఫీజు కట్టి పరీక్షలు రాయవచ్చని అధికారులు తెలిపారు.


Next Story