బాధితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలకు ఇది వర్తిస్తుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద, వెనుక బడిన వర్గాల విద్యార్దులకు కేటాయించాల్సి ఉంది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 23 నుంచి మార్చి 14 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
http://cse.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాలకు 1800 425 8599 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించవచ్చు. విద్యాహక్కు చట్టం కింద 2024-25 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు ఉచిత అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఒక ప్రక టనలో తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వీరికి 25 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లు వారు వెల్లడించారు. అర్హత గల విద్యార్థులు తమ ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి.