మరోసారి మారనున్న ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌.!

Inter exams schedule likely to be changed. ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ మరోసారి మారనుంది. జాతీయ పరీక్షల మండలి జేఈఈ పరీక్షల తేదీలను మార్చింది.

By అంజి  Published on  15 March 2022 7:29 AM IST
మరోసారి మారనున్న ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌.!

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ మరోసారి మారనుంది. జాతీయ పరీక్షల మండలి జేఈఈ పరీక్షల తేదీలను మార్చింది. ఏప్రిల్‌ 16 నుండి ప్రారంభం కావాల్సిన పరీక్షలు 21వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని పేర్కొంది. దీంతో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను మార్చే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జేఈఈ, ఇతర పరీక్షల కారణంగా ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను మార్చనున్నట్లు మంత్రి సబిత చెప్పారు. మొదట్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

అయితే జేఈఈ మెయిన్‌ నూతన పరీక్షలను దృష్టిలో పెట్టుకుని త్వరలో స్పష్టత ఇస్తామని మంత్రి సబిత తెలిపారు. దీనిపై ఈరోజు లేదా రేపు ప్రభుత్వం క్లారిటీ వస్తుందని మంత్రి అన్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షలు మే 21, 24, 25, మే 1, 4 తేదీల్లో జరగనున్నాయి. జేఈఈ పరీక్షల రోజు ఇంటర్‌ పరీక్షలు లేవు. అలాగే జేఈఈ నూతన తేదీల్లో సైతం ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలు లేవు. పక్క పక్క తేదీల్లో ఉన్నాయి. అయితే ఒక రోజు ఇంటర్‌ పరీక్షలు, మరో రోజు జేఈఈ పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరో వైపు మే 5వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభించినా.. మే 20వ తేదీ వరకు ముగుస్తాయి. ఆ తర్వాత 3 రోజులకే జేఈఈ చివరి విడత పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇంటర్‌ పరీక్ష తేదీలు మారితే ఖచ్చితంగా 10వ తరగతి పరీక్షల తేదీలను మార్చాల్సి ఉంటుంది.

Next Story