ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు జరగనుండగా.. మే 2 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇక మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. పదో తరగతి పరీక్షలను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 వరకు, ఇంటర్ పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు జరగడం లేదు. అయితే ఈసారి కరోనా తగ్గుముఖం పడుతుండటం, పాఠశాలలు, కళాశాలలు కొనసాగుతుండటంతో పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
పదో తరగతి పరీక్షలు
-మే 2 నుంచి 13 వరకు
- ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష
ఇంటర్ పరీక్షలు
- ఏప్రిల్ 8 నుంచి 28 వరకు
- ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరకు
- మార్చి 11 నుంచి 31వరకు ప్రాక్టికల్