EAPCET, PGECET, ICET షెడ్యూల్స్‌ ఇవే

ఎంటెక్‌, ఎం ఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసీఈటీ నోటిఫికేషన్‌ మార్చి 12వ తేదీన విడుదల కానుంది.

By అంజి  Published on  4 Feb 2025 8:00 AM IST
ICET, EAPCET, Telangana, PGECET

EAPCET, PGECET, ICET షెడ్యూల్స్‌ ఇవే

హైదరాబాద్‌: ఎంటెక్‌, ఎం ఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసీఈటీ నోటిఫికేషన్‌ మార్చి 12వ తేదీన విడుదల కానుంది. అదే నెల 17 నుంచి మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 16 నుంచి 19 వరకు పరీక్షలు ఉండనున్నాయి.

అలాగే ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఐసెట్‌ నోటిఫికేషన్‌ మార్చి 6వ తేదీన విడుదల కానుంది. అదే నెల 10 నుంచి మే 3 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. జూన్‌ 8, 9వ తేదీల్లో పరీక్షలు ఉంటాయి.

తెలంగాణ ఈఏపీసీఈటీ షెడ్యూల్‌ కూడా ఖరారు అయ్యింది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ సారి ఈఏపీసీఈటీని జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహిస్తోంది.

ఈ పరీక్షకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్ష తర్వాత విడుదల చేసే కీలో అభ్యంతరాలు లెవనెత్తాలంటే విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు రూ.500 చెల్లించాలనే కొత్త నిబంధన తీసుకొచ్చారు. వారి అబ్జక్షన్‌ సరైనదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగిస్తారు. హేతుబద్ధత లేకుండా వందల సంఖ్యలో అభ్యంతరాలు వస్తుండటతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో ఫ్రీగానే అబ్జక్షన్‌ను వ్యక్తపరిచే అవకాశం ఉండేది.

Next Story