ఆంధ్రప్రదేశ్‌లోని 28 ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 2025 - 26కు సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీ వరకు 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 31 - 03 - 2025 నాటికి 10 నుంచి 13 ఏళ్ల వయస్సు ఉండి, ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు.. ఈ ప్రవేశాలకు అర్హులు. ఒక్కో పాఠశాలలో 60 సీట్లు ఉంటాయి. దీనిలో బాలికలకు 30, బాలురకు 30 సీట్లు ఉంటాయి. ఇంగ్లీష్, సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధన ఉంటుంది. ఈ నెల 25వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన మెరిట్, అలాగే రిజర్వేషన్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.