గ్రూప్-1, 2 అభ్యర్థులకు శుభవార్త.. ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్
Good News for Group 1 and 2 candidates in Telangana.తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మంత్రి గంగుల కమలాకర్
By తోట వంశీ కుమార్ Published on 6 April 2022 3:01 PM ISTతెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మంత్రి గంగుల కమలాకర్ బుధవారం శుభవార్త చెప్పారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్న వేళ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుందని తెలిపారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల్లోపు ఉన్నవారు ఈరోజు నుంచి ఈనెల 16 లోపు ఆన్‌లైన్‌లో https://studycircle.cgg.gov.in, https://mjpabcwreis.cgg.gov.in లలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
పేద, వెనుకబడిన వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
— Gangula Kamalakar (@GKamalakarTRS) April 6, 2022
👉 పరీక్షలో ఎలాంటి టాంపరింగ్ కు ఆస్కారం లేకుండా పటిష్ట టెక్నాలజీ. వచ్చిన మార్కుల ఆధారంగా శిక్షణకు ఎంపిక
👉అభ్యర్థులు https://t.co/CfojKA5l0Dhttps://t.co/sYaZC5cqq0 లలో రిజిస్టర్ చేసుకోండి pic.twitter.com/yuM20ta71Y
ఈ నెల 16న ఆన్‌లైన్‌లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ నెల 21 నుంచి 1.25,000 మందికి ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో 25 వేల మందికి నేరుగా మిగతా లక్ష మందికి హైబ్రిడ్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 16 స్టడీ సర్కిళ్లు, 103 స్టడీ సెంట్లర్ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ముందుకొచ్చి మౌళిక వసతులు సమకూరిస్తే మరిన్ని స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
25వేల మందికి నేరుగా మిగతా లక్షమందికి హైబ్రిడ్ మోడ్లో శిక్షణ. ఈనెల 16న కోచింగ్ కోసం ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్, 21 నుండి శిక్షణ ప్రారంభం. 16 స్టడీ సర్కిళ్లు, 103 స్టడీ సెంటర్ల ద్వారా శిక్షణ. ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ముందుకొచ్చి మౌళిక వసతులు సమకూరిస్తే స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తాం pic.twitter.com/lARzTGcN0P
— Gangula Kamalakar (@GKamalakarTRS) April 6, 2022
అంతేకాకుండా గ్రూప్-1, గ్రూప్-2 రాసే 10 వేల మంది అభ్యర్ధులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గ్రూప్-1 అభ్యర్ధులకు 6నెలల పాటు నెలకు రూ. 5 వేలు, గ్రూప్-2 అభ్యర్ధులకు మూడు నెలల పాటు నెలకు రూ. 2వేలు, ఎస్సై అభ్యర్ధులకు నెలకు రూ.2వేలు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
నేటి నుండి బీసీ స్టడీ సర్కిళ్ల కోచింగ్ కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం.సుమారు 1,25,000 మందికి పైగా లబ్దీపొందేలా 50 కోట్లతో కోచింగ్ ప్రక్రియ రూపకల్పన.
— Gangula Kamalakar (@GKamalakarTRS) April 6, 2022
👉 గ్రూప్ 1 అభ్యర్థులకు ఆరు నెల్ల పాటు రూ. 5000 స్టైఫెండ్, గ్రూప్ 2, ఎస్సై అభ్యర్తులకు 3 నెలలు రూ. 2000 స్టైఫెండ్ అందిస్తాం pic.twitter.com/givD6cdDgS