గేట్ 2022 పరీక్షల షెడ్యూల్ విడుదల
GATE 2022 exam schedule released.గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2022 పరీక్షల
By తోట వంశీ కుమార్ Published on 21 Dec 2021 10:48 AM ISTగ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2022 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజినీరింగ్ విద్యలో పీజీ ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం గేట్ పరీక్షను నిర్వహిస్తుంటారు. గేట్ పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల్లో ఎంటెక్ /ఎంఈలలో ప్రవేశాలు పొందవచ్చు. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్(పీఎస్యూ)లు సైతం గేట్ స్కోర్ను ప్రామాణికంగా తీసుకొని నియామకాలు చేపడుతున్నాయి. ఈ సారి గేట్ పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహిస్తోంది.
2022 ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు దేశ వ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. జనవరి 3వ తేదీ నుంచి అడ్మిట్ కార్డులను www.gate.iitkgp.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్ష రోజు వరకు అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ హార్డ్ కాపీని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్దతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. మార్చి 17 వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సారి కొత్తగా రెండు పేపర్లను ప్రవేశపెట్టారు. గతంలో మొత్తం 27 బ్రాంచ్లకు పరీక్ష నిర్వహిస్తుండగా.. ఇప్పటి నుంచి 29 బ్రాంచ్లకు పరీక్ష నిర్వహిస్తారు. ఈసారి జియోమాటిక్స్ ఇంజనీరింగ్ (జీఈ), నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ (ఎన్ఎం) అనే రెండు కొత్త పేపర్లను ప్రవేశపెట్టారు. నౌకానిర్మాణ పరిశ్రమలు, జియో- ఇన్ఫర్మేటిక్స్ కోర్సులు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో ఈ బ్రాంచుల్లో కూడా గేట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.