విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి ఇలా దూరం చేయండి
టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. దీంతో స్కూల్, కాలేజీ విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
By అంజి Published on 22 Feb 2024 8:15 AM GMTవిద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి ఇలా దూరం చేయండి
టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. దీంతో స్కూల్, కాలేజీ విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే పరీక్షల సమయానికి సిలబస్ పూర్తిగా చదవగలమో లేదో.. పరీక్షలు ఎలా రాస్తామో అనే ఒత్తిడి వారిలో ఎక్కువగా ఉంటుంది. దాన్ని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వారిలో పరీక్షలు అంటే భయం, ఆందోళన కనిపిస్తుంటే.. కాసేపు సమయం కేటాయించి వారితో సంతోషంగా మాట్లాడండి. పిల్లలు ఎప్పుడూ చదువుతూ ఉండటమే కాకుండా మధ్య మధ్యలో కాస్త రెస్ట్ తీసుకోమని సూచించండి.
ఏ సబ్జెక్టు విషయంలో వారు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారో అడిగి తెలుసుకుని భయం పోగొట్టేలా భరోసా ఇవ్వండి. పిల్లలు మరీ రాత్రి వేళ నిద్రలేకుండా చదువుతుంటే అలా వద్దని చెప్పంది. ఇలా చేయడం వల్ల వారికి చదివేది సరిగా అర్థం కాదు. ఏకాగ్రత కుదరదు. నీరసం వస్తుంది. అందుకే రాత్రి వేళ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూడండి. యోగా, పజిల్స్ వంటివి చేయించడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది. పరీక్షల భయంతో కొందరు సరిగా తినరు. దీని వల్ల పరీక్షల ముందు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే వారికి మంచి పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాలి.
విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించేది పరీక్షలే కాబట్టి.. మంచి మార్కులు సాధించడం ఎంతో ముఖ్యం. ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించాలంటే పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే పరీక్షలు దగ్గరపడటంతో కొందరు విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. సిలబస్ మొత్తం చదవడం పూర్తి కాలేదని కొందరు, రివిజన్ కాలేదని మరికొందరు టెన్షన్ పడుతుంటారు. ఈ సమయంలో టెన్షన్ పడొద్దు. ఇప్పటి వరకు చదివిన పాఠాలను రివిజన్ చేస్తుండాలి. చివరి నిమిషంలో కొత్త టాపిక్‌లో జోలికి వెళ్లకూడదు. కొత్త టాపిక్‌లు చదవడం వల్ల దానిని రివిజన్ చేసే సమయం లేకపోతే గుర్తుండకపోవచ్చు. కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అవుతామని, పేరేంట్స్ ఏమాంటారోనని మానసికంగి ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి తల్లిదండ్రులు అండగా నిలిచి భరోసా ఇవ్వాలి. అప్పుడే వారు ప్రశ్నాంతంగా టెన్షన్ లేకుండా చదవడానికి అవకాశం ఉంటుంది.