Telangana: నేటి నుంచే ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ
ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నారు. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 14 వరకు చెల్లించొచ్చు.
By - అంజి |
Telangana: నేటి నుంచే ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ
హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నారు. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 14 వరకు చెల్లించొచ్చు. రూ.100 ఫైన్‌తో ఈ నెల 16 నుంచి 24 వరకు, రూ.500 ఫైన్‌తో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 1 వరకు, రూ.2 వేల జరిమానాతో డిసెంబర్ 10 నుంచి 15 వరకు స్వీకరిస్తారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్‌కు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ స్టూడెంట్స్‌కు రూ.630, ఫస్టియర్ ఒకేషనల్‌కి రూ.870, సెకండియర్ ఆర్ట్స్‌కు రూ.630, సెకండియర్ సైన్స్, ఒకేషనల్‌కి రూ.870 చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు–2026 మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 25న, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 26న ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ పరీక్షల బోర్డు శుక్రవారం (అక్టోబర్ 31, 2025) పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. అన్ని థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. రెండు పరీక్షల మధ్య కనీసం ఒక రోజు విరామం ఉంటుంది.
ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 (సోమవారం) నుండి ఫిబ్రవరి 21 (శనివారం) వరకు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. అభ్యర్థుల పరీక్ష తేదీ JEE షెడ్యూల్‌తో విభేదిస్తే ప్రత్యేక నిబంధన పెడతామని బోర్డు తెలిపింది. ఒకేషనల్ కోర్సులకు కూడా తేదీలు ఒకేలా ఉంటాయి. అయితే, ప్రత్యేక టైమ్‌టేబుల్ జారీ చేయబడుతుంది.