విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవులను పొడిగించనున్నారా..?
Extension of Sankranti holidays in AP.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త.
By తోట వంశీ కుమార్ Published on
3 Jan 2023 8:25 AM GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. సంక్రాంతి సెలవులను పొడిగించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. అనంతరం 17న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే.. దీనిపై ఉపాధ్యాయ సమాఖ్య. ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.
గతంలో 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చే వారన్నారు. కనీసం 18వ తేదీ వరకు అయినా సెలవులు పొడిగించాలని మంత్రి బొత్స సత్యనారాయణను ఉపాధ్యాయ సమాఖ్య. ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా ఉపాధ్యాయ సంఘాలు తెలిపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Next Story