తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జులై 5 నుంచి 9 వరకు టీఎస్ ఎంసెట్‌ను నిర్వహించను్ననట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. జులై 1వ తేదీన టీఎస్ ఈసెట్, జూన్ 20వ తేదీన పీజీఈ సెట్ నిర్వహించనున్నారు. ఎంసెట్, ఈసెట్‌ను జేఎన్‌టీయూ నిర్వహించనుండగా.. పీజీ ఈసెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. టీఎస్ ఐసెట్, టీఎస్ ఎడ్‌సెట్, టీఎస్ లాసెట్, టీఎస్ పీఈసెట్ తేదీలు నిర్ణయించాల్సి ఉందని ప్రకటనలో ఉన్నత విద్యామండలి పేర్కొంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో.. తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక పరీక్షల నిర్వహణ కోసం ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్ లాసెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సీటీకి అప్పగించారు. టీఎస్ పీఈసెట్ నిర్వహణను ఈ ఏడాది కూడా మహాత్మాగాంధీ యూనివర్సిటీకే అప్పగించారు.
పరీక్షల షెడ్యూల్..
జూన్ 20న పీజీ ఈసెట్
జులై 1న ఈ-సెట్
జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్