రేప‌ట్నుంచి ఇంట‌ర్ కాలేజీల‌కు ద‌స‌రా సెలవులు

Dasara holidays for junior colleges in Telangana from October 2.తెలంగాణ రాష్ట్రంలోని ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2022 2:23 PM IST
రేప‌ట్నుంచి ఇంట‌ర్ కాలేజీల‌కు ద‌స‌రా సెలవులు

తెలంగాణ రాష్ట్రంలోని ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. ఆదివారం నుంచి ద‌స‌రా సెల‌వులు ప్రారంభం కానున్నాయి. అక్టోబ‌ర్ 2 నుంచి అక్టోబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టిస్తూ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అక్టోబ‌ర్ 10న సోమ‌వారం కాలేజీలు పునఃప్రారంభం కానున్న‌ట్లు తెలిపింది. ఇక సెల‌వుల్లో కాస్లులు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇంట‌ర్ బోర్డు హెచ్చ‌రించింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించే యాజ‌మాన్యాలు, ప్రిన్సిపాల్స్‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కోఆపరేటివ్, గురుకుల జూనియర్ కాలేజీలు ఉత్తర్వుల మేరకు దసరా సెలవులు పాటించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

ఇంట‌ర్ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను జూలై 1 నుంచి ప్రారంభం అయ్యాయి. 221 పని దినాలు ఉండ‌నున్నాయి. జూన్ 15 నుంచి సెకండ్ ఇయర్, జూలై 1 నుంచి ఫస్ట్ ఇంటర్ తరగతులు ప్రారంభించారు. అకడమిక్ క్యాలెండర్ విడుదల సమయంలోనే.. అక్టోబరు 2 నుంచి 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డ్ వెల్లడించింది.

Next Story