కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖ దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందిస్తోంది. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ డిజెబిలిటీ కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ (9,10వ తరగతులు)కు ఈ నెల 30 వరకు అప్లైకి అవకాశం ఉంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ (ఇంటర్ నుంచి పీజీ వరకు), టాప్‌క్లాస్ ఎడ్యకేషన్ స్కాలర్‌షిప్‌కు (ప్రముఖ విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేట్ పీజీ కోర్సులు) అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు తల్లిదండ్రుల వార్షికాదయం రూ.2.5 లక్షల లోపు, టాప్ క్లాస్ స్కాలర్‌షిప్‌కు పేరెంట్స్ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. దేశ వ్యాప్తంగా ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ 25 వేల మందికి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ 17 వేల మందికి, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్ షిప్ 300 మందికి ఇస్తారు. పూర్తి వివరాలకు https://scholarships.gov.in ను విజిట్ చేయండి.