సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌.. అమ్మాయిల‌దే హ‌వా

CBSE Class XII results 92.71% students qualify.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ప‌రీక్షా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2022 8:08 AM GMT
సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌.. అమ్మాయిల‌దే హ‌వా

హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ప‌రీక్షా ఫ‌లితాలు శుక్ర‌వారం వెలువ‌డ్డాయి. ఈ ఫ‌లితాల‌ను సీబీఎస్ఈ బోర్డు ఈ ఉద‌యం విడుద‌ల చేసింది. ఏప్రిల్ 26 నుంచి జూన్ 15 వరకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 14,35,366 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాశారు. అందులో 13,30,662 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణ‌త శాతం 92.71. విద్యార్థులు తమ స్కోర్‌ కార్డులను cbse.gov.in, results.cbse.nic.in వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

బాలుర‌ కంటే బాలిక‌ల ఉత్తీర్ణ‌త 3.29 శాతం అధికంగా ఉంది. ఈ ఏడాది ప‌రీక్ష‌ల్లో అమ్మాయిలు 94.54 శాతం, అబ్బాయిలు 91.25 శాతం పాసయ్యారు. 33 వేల మంది విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోరు సాధించారు. ట్రాన్స్ విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణతతో తమ పనితీరును మెరుగుపరిచారు. 2019లో వారి ఉత్తీర్ణత శాతం 83.33% కాగా 2020లో 86.19%.

-ప్రాంతాల వారిగా అత్య‌థికంగా త్రివేండ్రం ప్రాంతం 98.83% ఉత్తీర్ణతతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది, బెంగళూరు (98.16%), చెన్నై (97.79%) ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నాయి.

- వివిధ CBSE సంస్థలలో, JNV అత్యధికంగా 98.93% ఉత్తీర్ణత సాధించగా, సెంట్రల్ టిబెటన్ స్కూల్ అసోసియేషన్ (CTSA) 97.96%, మరియు KV 97.04% ఉత్తీర్ణత సాధించింది.

- ప్రభుత్వ-సహాయక CBSE పాఠశాలలు 94.81% మరియు స్వతంత్ర CBSE పాఠశాలలు 92.20% సాధించాయి.

- విదేశీ CBSE పాఠశాలల్లో 93.98% మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.


Next Story