గ్రూప్‌-1, 2 ఉద్యోగాలు.. ఎడిట్‌కు ఏపీపీఎస్‌సీ అవకాశం

తాజాగా గ్రూప్‌-2, 1 ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది.

By అంజి  Published on  21 Jan 2024 1:01 AM GMT
APPSC, Job candidates, Group 1, Group 2, APnews

గ్రూప్‌-1, 2 ఉద్యోగాలు.. ఎడిట్‌కు ఏపీపీఎస్‌సీ అవకాశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 897 గ్రూప్‌ -2 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఈ నెల 17వ తేదీతో ముగిసింది. గ్రూప్‌-2కు దాదాపు 4 లక్షల 80 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 533 మంది పోటీప‌డుతున్నారు. గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించనున్నారు. తాజాగా గ్రూప్‌-2, 1 ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది. ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో ఏమైన పొర‌పాట్లు జ‌రిగితే.. వీటిని స‌రిదిద్దుకునే అవ‌కాశం ఏపీపీఎస్సీ క‌ల్పించింది. ఈ అవ‌కాశం కొద్ది రోజులు మాత్ర‌మే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

అలాగే 81 గ్రూప్‌ -1 పోస్టులకు అప్లికేషన్‌ పెట్టుకునేందుకు రేపే ఆఖరు తేదీ. మార్చి 17వ తేదీన గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు అయితే దరఖాస్తులో పొరపాట్లు జరిగాయని, ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలని చాలా మంది అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్‌సీ సభ్యుడు పరిగె సుధీర్‌ కీలక ప్రకటన చేశారు. వివరాలను ఎడిట్‌ చేసుకోవాలనుకునేవారు appscgroup2corrections@gmail.com లేదంటే parigesudhir@gmail.com కు వివరాలను పంపాలని సూచించారు.

Next Story