తెలంగాణలోని బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపు (మే 17) ఆఖరు తేదీ. మే 12 వరకు గడువు ముగిసినప్పటికీ.. దరఖాస్తు చేసుకోని వారి కోసం అవకాశం కల్పించారు. టెన్త్ పూర్తి చేసుకున్న విద్యార్థులు https://mjpabcwries.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీలతో పాటు అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. టెన్త్‌తో ఇంజినీరింగ్ చేయాలనుకునే విద్యార్థుల నుంచి ఆర్జీయూకేటీ ఐఐఐటీ నూజివీడు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల విద్యార్థులు మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో సాధించిన అకడమిక్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందులో ప్రవేశం లభించడం ద్వారా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ చేయవచ్చు.