ఏపీ పాలిసెట్ 2021 ఫ‌లితాలు విడుద‌ల‌

AP Polycet 2021 Results Out.ఏపీ పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధ‌వారం విడుద‌ల అయ్యాయి. రాష్ట్ర ఐటీ,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sept 2021 12:00 PM IST
ఏపీ పాలిసెట్ 2021 ఫ‌లితాలు విడుద‌ల‌

ఏపీ పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధ‌వారం విడుద‌ల అయ్యాయి. రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివద్ధి శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఫ‌లితాల‌ను విడుద‌ల‌ చేశారు. పాలిసెట్ ప‌రీక్ష‌కు 74,884 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. సెప్టెంబ‌ర్ 1న నిర్వ‌హించిన పరీక్ష‌కు 68,208 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

ఫ‌లితాల విడుద‌ల సంద‌ర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడారు. ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. 81వేల మంది విద్యార్థులకి జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.128 కోట్లు అందజేశామన్నారు. జగనన్న వసతిదీవెన కింద 72 వేల మంది విద్యార్థులకి రూ.54 కోట్లు అందించామ‌ని తెలిపారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా శ్రీకాకుళం అని చెప్పారు.అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా నెల్లూరు అని అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా ప్రకాశం అని మంత్రి పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే అధికారులు ఈ ఏడాది ప్రశ్నా పత్రంలో మార్పులు చేపట్టిన విషయం విధితమే. గతంలో 120 మార్కులకు ఇచ్చే ప్రశ్నపత్రంలో మ్యాథ్స్‌ 60 మార్కులకు, ఫిజిక్స్‌ 30, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉండేవి. కానీ ఈసారి అవే 120 మార్కుల ప్రశ్నపత్రంలో మ్యాథ్స్‌ 50 మార్కులకు, ఫిజిక్స్‌ 40 మార్కులకు, కెమిస్ట్రీ 30 మార్కులతో పరీక్షను నిర్వహించారు.

Next Story