ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు పాసైన విద్యార్థులకు అలర్ట్. జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మొదటి సంవత్సరం ప్రవేశాలను ఈ నెలలోనే ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 20 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం దరఖాస్తుల విక్రయం ప్రారంభించాలని, జులై 1న తరగతులు చేపట్టాలని సూచించింది.
ఈ నెల 20 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని, జులై 20 ఆఖరి తేదీగా నిర్ణయించింది. జూన్ 27 నుంచి అడ్మిషన్లు మొదలు పెట్టి జులై 20 తేదీతో పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. కాగా.. ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో 4.14లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే.
షెడ్యూల్ ఇదే..
దరఖాస్తుల విక్రయం : జూన్ 20
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : జూలై 20
అడ్మిషన్లు ప్రారంభం: జూన్ 27
అడ్మిషన్లు పూర్తయ్యేది : జులై 20
ఫస్టియర్ తరగతులు ప్రారంభం: జులై 1