అల‌ర్ట్‌.. ఏపీలో మార్చి 15 నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు.. షెడ్యూల్ ఇదే

AP Inter 1st and 2nd year 2023 time table released.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఇంట‌ర్ విద్యార్థుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2022 3:02 AM GMT
అల‌ర్ట్‌.. ఏపీలో మార్చి 15 నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఇంట‌ర్ విద్యార్థుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌. ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. మార్చి 15 నుంచి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్న‌ట్లు ఇంట‌ర్ విద్యామండ‌లి కార్య‌ద‌ర్శి శేష‌గిరిబాబు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేశారు. ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వ‌ర‌కు జ‌ర‌గ‌నుండ‌గా, రెండ‌వ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. మాన‌వ విలువ‌లు, ఎథిక్స్ పరీక్ష ఫిబ్ర‌వ‌రి 22న‌, ప‌ర్యావ‌ర‌ణ విద్య ప‌రీక్ష 24న ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ఉంటాయి. ఇక ప్రాక్టిక‌ల్స్‌ను ఏప్రిల్ రెండో వారం నుంచి మే రెండో వారం వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

ఇంటర్ మొదటి సంవత్సరం ప‌రీక్ష‌ల షెడ్యూల్

మార్చి 15 - సెకండ్ లాంగ్వేజ్

మార్చ్ 17 - ఇంగ్లీష్‌

మార్చ్ 20 - గణితం పేపర్ 1ఏ, బోటనీ, సివిక్స్

మార్చ్ 23 - గణితం పేపర్ 1బి, జువాలజీ, హిస్టరీ

మార్చ్ 25 - ఫిజిక్స్, ఎకనామిక్స్

మార్చ్ 28 - కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్

మార్చ్ 31 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు, ఎంబైపీసి మేధ్స్

ఏప్రిల్ 3 - మోడర్న్ లాంగ్వేజ్, జియాగ్రఫీ


ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్

మార్చ్ 16 - సెకండ్ లాంగ్వేజ్

మార్చ్ 18 - ఇంగ్లీష్‌

మార్చ్ 21 - గ‌ణితం పేపర్ 2ఏ, బోటనీ, సివిక్స్

మార్చ్ 24 - గ‌ణితం పేపర్ 2బి, జువాలజీ, హిస్టరీ

మార్చ్ 27 - ఫిజిక్స్, ఎకనామిక్స్

మార్చ్ 29 - కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్

ఏప్రిల్ 1 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు, ఎంబైపీసీ మేధ్స్

ఏప్రిల్ 4 - మోడర్న్ లాంగ్వేజ్, జియాగ్రఫీ




Next Story