ఏపీ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. రేపు స్కూళ్ల‌కు సెల‌వు ర‌ద్దు

AP Govt cancelled second Saturday holiday on August 13th.ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు అల‌ర్ట్‌. ఆజాదీ కా అమృత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2022 9:19 AM IST
ఏపీ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. రేపు స్కూళ్ల‌కు సెల‌వు ర‌ద్దు

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు అల‌ర్ట్‌. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా రేపు(ఆగ‌స్టు 13 రెండో శ‌నివారం) సెల‌వును ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఆగ‌స్టు 13న వ‌ర్కింగ్‌ డేగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు విద్యాశాఖ తెలియ‌జేసింది. ఈ మేర‌కు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 15వ తేదీ వరకు అన్ని పాఠ‌శాల‌ల్లో మ్యూజిక్, డ్యాన్స్, ర్యాలీలు, పెయింటింగ్, గ్రూప్ డిస్కషన్స్, జాతీయ జెండాలతో సెల్ఫీలు దిగి అప్‌లోడ్ చేయడం లాంటి కార్యక్రమాలు ఉంటాయ‌ని, ఈ నేప‌థ్యంలోనే ఆగ‌స్టు 13వ తేదీని వ‌ర్కింగ్ డేగా పేర్కొంటూ విద్యాశాఖ స‌ర్క్యుల‌ర్‌ను జారీ చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఏపీలో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.

మరోవైపు తెలంగాణలోని పాఠ‌శాల‌ల‌ సెలవులపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆగ‌స్టు 12న‌ (శుక్ర‌వారం)న రాఖీ పండుగ‌, ఆగ‌స్టు 13న‌ రెండో శ‌నివారం కారణంగా సెల‌వులు ఉన్నాయి. అలాగే ఆగ‌స్టు 14న ఆదివారం కావ‌డం, సోమ‌వారం ఆగ‌స్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్స‌వం కావడంతో సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపైనా స్పష్టత రావాల్సి ఉంది. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు పూర్తి కావ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం ప‌లు కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16న ఉద‌యం 11.30 గంట‌ల‌కు జాతీయ గీతాలాప‌న నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది.

Next Story