Andhra: ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలపై క్లారిటీ ఇదే

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్‌ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.

By అంజి  Published on  9 Jan 2025 8:10 AM IST
AP government, Inter first year, exams, Inter Board

Andhra: ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలపై క్లారిటీ ఇదే

అమరావతి: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్‌ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఫస్టియర్‌ పరీక్షలు కాలేజీలు నిర్వహించి, సెకండియర్‌ ఎగ్జామ్స్‌ బోర్డు నిర్వహించాలన్నది ప్రతిపాదనే అని తెలిపింది. జనవరి 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆ తర్వాత ఉతది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.

కాగా నిన్న ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలను తొలగించడంపై ప్రతిపాదనలు స్వీకరిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. కేవలం సెకండియర్‌ పరీక్షలను మాత్రమే నిర్వహించాలనకుంటున్నామన్నారు. 2025 - 26 నుంచి ఇంటర్‌లో సైన్స్‌ సబ్జెక్టుల్లో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ ప్రవేశపెడతామన్నారు.

Next Story