ఏపీ విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడే ఛాన్స్‌.!

AP education dept. officials to meet today over inter exams. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2022–23 మొదటి దశ షెడ్యూల్‌ను ఏప్రిల్ 21కి వాయిదా

By అంజి
Published on : 15 March 2022 9:12 AM IST

ఏపీ విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడే ఛాన్స్‌.!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2022–23 మొదటి దశ షెడ్యూల్‌ను ఏప్రిల్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం.. పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జరుగుతాయి. అసలు షెడ్యూల్ ప్రకారం.. మొదటి దశ జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాల్సి ఉంది. అయితే వివిధ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్, జేఈఈ పరీక్షలు ఒకేసారి రావడంతో.. విద్యార్థుల అభ్యర్థనల మేరకు మార్పులు చేస్తున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ప్రధాన నమోదు ప్రక్రియ, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 1 నుండి 31 వరకు కొనసాగుతుంది. పరీక్షా కేంద్రాల కోసం నగరాల సమాచారం ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుంది. అడ్మిట్ కార్డులను ఏప్రిల్ రెండో వారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది.

జేఈఈ మెయిన్ తొలి దశ షెడ్యూల్‌లో మార్పు ఏపీ ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలపై ప్రభావం చూపుతోంది. జేఈఈ మొదటి దశ పరీక్షల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసింది. ఏప్రిల్ 22 నుంచి మే 12వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను మార్చిన బోర్డు.. ఇప్పుడు జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్షలు ఏప్రిల్ 21కి మే 4కి వాయిదా పడడంతో ఇంటర్మీడియట్ పరీక్షల్లో మరోసారి గందరగోళం నెలకొంది. జేఈఈ పరీక్షలు ఏప్రిల్ 25న ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ పేపర్, ఏప్రిల్ 29న గణితం ఒకేసారి వచ్చాయి. దీంతో ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ అధికారులు మంగళవారం సమావేశమై పరీక్షలను వాయిదా వేయక తప్పదని భావిస్తున్నారు.

Next Story