ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులతో పాటు సప్లమెంటరీ విద్యార్థులు ఫీజులు చెల్లింపు తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 11 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. అలాగే రూ.1000 ఆలస్య రుసుముతో నవంబర్ 20 లోగా కట్టొచ్చని వెల్లడించారు.
ఈ గడువు తర్వాత ఇక అవకాశం ఉండదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్‌కు సూచించింది. ఇంటర్ ఎగ్జామ్స్ ప్రైవేట్‌గా రాసేవారు రూ.1500తో నవంబర్ 15లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 30లోగా రూ.500 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు. ఆ తర్వాత ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపుకు ఎలాంటి గడువు పొడిగింపు ఉండదని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.