ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల వాయిదా

AP 10th Result 2022 Postponed.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల వాయిదా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2022 12:02 PM IST
ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల వాయిదా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాల విడుద‌ల వాయిదా ప‌డింది. జూన్ 6(సోమ‌వారం) ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కార‌ణాల‌తోనే వాయిదా వేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. ముందుగా చెప్పిన‌ట్లుగా ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ఫ‌లితాలు విడుద‌ల కావాల్సి ఉంది. ఫ‌లితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6ల‌క్ష‌ల మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఎదురుచూశారు.

ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీవరకు రాష్ట్రంలో పది పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ సారి ఫలితాలను గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ప్ర‌క‌టిస్తామ‌ని అధికారులు తెలిపారు. కాగా ఎవరైనా ర్యాంకులపై ప్రకటనలు ఇచ్చే విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇదివరకే విద్యాశాఖ అధికారులు హెచ్చ‌రించారు.

Next Story