ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
AP 10th class Exam 2021 Schedule released.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 3 Feb 2021 12:17 PM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ ఏడాది ఏడు పేపర్లు ఉండనున్నాయని ఆయన వెల్లడించారు. జూన్ 7న ఫస్ట్ లాంగ్వేజ్, ఎనిమిదిన సెకండ్ లాంగ్వేజ్, తొమ్మిదో తేదీన ఇంగ్లీష్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు వెల్లడించారు.
ఇక కరోనా కాలంగా విద్యాసంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభం కావడంతో.. దశల వారీగా తరగతులు మొదలుపెట్టామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి అన్ని పాఠశాలలు యథాతథంగా పనిచేస్తున్నాయన్నారు. మే 3 నుంచి 15 వరకు 1 నుంచి 9 తరగతులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జూలై 21 నుంచి నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్
07-06-2021 - ఫస్ట్ లాంగ్వేజ్(గ్రూప్ ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1(కాంపోజిట్ కోర్సు)
08-06-2021 - సెకండ్ లాంగ్వేజ్
09-06-2021 - ఇంగ్లీష్
10-06-2021 - గణితం
11-06-2021 - ఫిజికల్ సైన్స్
12-06-2021 - బయోలాజికల్ సైన్స్
14-06-2021 - సోషల్ స్టడీస్
15-06-2021 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(కాంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్1( సంస్కృతం, అరబిక్, పర్షియన్)
16-06-2021 - ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2(సంస్కృతం, అరబిక్, పర్షియన్), ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు(థియరీ)