అలర్ట్‌.. ఏపీ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

Andhra Pradesh SSC exam Time Table 2023 released.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Dec 2022 3:05 PM IST
అలర్ట్‌.. ఏపీ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థుల‌కు అల‌ర్ట్‌. వార్షిక ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు విద్యాశాఖ వెల్ల‌డించింది. ఆరు పేప‌ర్ల‌తోనే ప‌రీక్ష‌లు ఉండ‌నున్నాయి. ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నాం 12.45 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. సీబీఎస్ఈ త‌ర‌హాలో రోజు విడిచి రోజు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. రూ.500 రుసుముతో జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం క‌ల్పించారు.

షెడ్యూల్ ఇదే..

ఏప్రిల్ 3 - ఫ‌స్ట్ లాంగ్వేజ్‌

ఏప్రిల్ 6 - సెకండ్ లాంగ్వేజ్‌

ఏప్రిల్ 8 - ఇంగ్లీష్‌

ఏప్రిల్ 10 - గ‌ణితం

ఏప్రిల్ 13 - సైన్స్‌

ఏప్రిల్ 15 - సాంఘీక శాస్త్రం

ఏప్రిల్ 17 - కాంపోజిట్ కోర్సు

ఏప్రిల్ 18 - ఒకేష‌న‌ల్ కోర్సు


Next Story