ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసింది. మార్చి 17 నుంచి 28వ తేదీ వరకు రోజు విడిచి రోజు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. 17వ తేదీన హిందీ, 19వ తేదీన ఇంగ్లీష్, 21వ తేదీన తెలుగు/ఉర్దూ/కన్నడ/ఒరియా/ తమిళం, 24వ తేదీన మ్యాథ్స్, 26న శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, 28న సోషల్, ఆర్థిక శాస్త్ర పరీక్షలు నిర్వహిస్తారు.
కాగా రెగ్యులర్ పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 31 వరకు జరుగుతాయి. కాగా ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్ టెన్త్ క్లాస్ ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. లాంగ్వేజెస్, మ్యాథ్స్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పేపర్లకు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు జరుగుతాయి.