హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో త్వరలో స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ప్రారంభించనుంది. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యతో పాటు స్కాలర్‌షిప్ అందించనున్నారు. ఇటీవల రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RASCI)తో యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి త్వరలో RASCIతో కలిసి ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ప్రతి విద్యార్థికి విద్యతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దనున్నారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు నెలకురూ.7 వేల నుంచి రూ.24 వేల వరకు సంపాదించుకునే అవకాశం కల్పించనున్నారు. 28 ఏళ్ల వయస్సు ఉండి.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సులో చేరవచ్చు.