టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపుకు షెడ్యూల్ విడుదల అయ్యింది.
By అంజి Published on 1 Nov 2024 3:15 AM GMTటెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపుకు షెడ్యూల్ విడుదల అయ్యింది. నవంబర్ 11వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజును ప్రధానోపాధ్యాయుల ద్వారా చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 12 నుంచి నవంబర్ 18 వరకు, రూ.200 ఫైన్‌తో నవంబర్ 19 నుంచి నవంబర్ 25 వరకు, రూ.500 ఫైన్‌తో నవంబర్ 26 నుంచి 30 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలని తెలిపింది. 2024 - 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్ష ఫీజు రూ.125. వయసు తక్కువ ఉండి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.
అటు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజును నవంబర్ 11 వ తేదీ వరకు చెల్లించవచ్చని ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి తెలిపింది. ఇటు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు నవంబర్ 14వ తేదీ ఆఖరు తేదీ. రూ.100 ఫైన్‌తో నవంబర్ 26 వరకు చెల్లించవచ్చు.