విద్యార్థులను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.50 వేల చొప్పున డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్లు ఆర్థిక సాయం చేస్తారు.
ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్‌కు డిప్లొమా (పాలిటెక్నిక్), డిగ్రీ (ఇంజినీరింగ్) కోర్సులో ప్రవేశం పొందిన, చదువుతున్న అమ్మాయిలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిల వరకు ఆర్థిక సహకారం అందిస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు.
ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్ స్కీమ్‌కు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ డిగ్రీ ప్రవేశం పొందిన, చదువుతున్న దివ్యాంగులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏఐసీటీఈ స్వనాథ్ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు అనాథలు, వీరమరణం పొందిన సైనికుల పిల్లలు, కోవిడ్ 19 ద్వారా పేరెంట్స్‌ను కోల్పోయిన వారి పిల్లలు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కోర్సు చదువుతుంటే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.