టీఎస్‌ ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీఎల్‌సెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024 - 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

By అంజి  Published on  7 March 2024 7:22 AM IST
TS ICET, EDCET, LAWCET, PGLCET, Telangana

టీఎస్‌ ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీఎల్‌సెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

టీఎస్‌ ఐసెట్‌

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024 - 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. నేటి నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.550, ఇతరులు రూ.750 ఫీజు చెల్లించాలని, దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మే 17 నుంచి 20వ తేదీ వరకు మార్పులు చేసుకోవచ్చు. జూన్‌ 4, 5 తేదీల్లో పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. మే 20వ తేదీన హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. జూన్‌ 15న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్‌ 28న ఫలితాలు వెల్లడిస్తామని కాకతీయ యూనివర్సిటీ తెలిపింది.

లాసెట్‌, పీజీఎల్‌సెట్‌

తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. లాయర్‌ వృత్తిపై ఆసక్తి ఉన్న వారు ఏప్రిల్‌ 15లోపు దరఖాస్తు చేసుకోగలరు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 30న హాల్‌ టికెట్లు విడుదల చేయనున్నారు. జూన్‌ 3న టీఎస్‌ లాసెట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఉదయం 10.30 నుంచి మధ్‌యాహ్‌నం 12 గంటల వరకు, పీజీఎల్‌సెట్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. లాసెట్‌ దరఖాస్తు ఫీజు రూ.900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. పీజీఎల్‌ సెట్‌ దరఖాస్తు ఫీజు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే మే 20 నుంచి 25 వరకు సవరించుకోవచ్చు.

ఎడ్‌సెట్‌

తెలంగాణలో ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.. టీచర్‌ వృత్తిపై ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి రెండేళ్లు ఉంటుంది. ఎడ్‌సెట్‌ ఎంట్రన్స్‌కు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. చివరి తేదీ మే 6. రూ.250 ఫైన్‌తో మే 13 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు పీజు రూ.750. ఎంట్రన్‌ టెస్ట్‌ను మే 23న నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో పాస్‌ అయిన వారు, డిగ్రీ లాస్ట్‌ ఇయర్‌ చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Next Story