'కల్కి' భగవాన్ పై ఈడీ కేసు ..!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Oct 2019 1:09 PM GMTచెన్నై: కల్కి భగవాన్‌పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. కల్కి భగవాన్ కుమారుడిపై కూడా కేసు పెట్టారు. ఐదు రోజులపాటు దేశవ్యాప్తంగా ఉన్న కల్కి ఆశ్రమాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వందల కోట్ల రూపాయలు, డాలర్లు, కేజీల కొద్దీ బంగారాన్ని సీజ్ చేశారు. పెద్ద మొత్తంలో హవాలాతోపాటు, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అధికారులు చెప్పారు.
హైదరాబాద్‌లోని కల్కికి సంబంధించిన సంస్థలు, స్టూడియో ఎన్‌లో కూడా సోదాలు చేశారు. స్టూడియో ఎన్‌లో కల్కి భగవాన్ పెట్టుబడులు పెట్టి..కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. సౌత్ ఇండియా వ్యాప్తంగా కల్కి భగవాన్‌కు ఆశ్రమాలు ఉన్నాయి. ఎన్నో ట్రస్ట్‌లు ఉన్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లాలో కూడా కల్కి భగవాన్‌కు ఆశ్రమం ఉంది. పెద్ద సంఖ్యలో విదేశీలు కల్కి ఆశ్రమాలకు వస్తుంటారు.
సోదాలు జరిగే సమయంలో కల్కి భగవాన్ దంపతులు ఇక్కడ లేరు. కల్కి భగవాన్ పరారీలో ఉన్నారని ప్రచారం జరిగింది.అయితే..తాను పారిపోలేదని..అందుబాటులోనే ఉన్నానని కల్కి భగవాన్ మీడియాకు చెప్పారు.