ఆన్ లైన్ విక్రయాలకు మళ్లీ బ్రేక్ వేసిన కేంద్రం
By రాణి Published on 19 April 2020 5:25 PM IST
భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ గడువును మే 3వ తేదీ వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15న లాక్ డౌన్ సమయంలోనూ కొన్నిరంగాల్లో సవరింపులు చేస్తూ మార్గదర్శకాలు చేసింది కేంద్రం. పల్లెల్లో వ్యవసాయ కార్యకలాపాలను యథాతథంగా విధించుకోవచ్చన్న కేంద్రం 20వ తేదీ నుంచి ఆన్ లైన్ విక్రయాలకు కూడా నిబంధనలతో కూడిన పర్మిషన్లిచ్చింది. ఆన్ లైన్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లతో పాటు ఇతర ఈ కామర్స్ సంస్థలు సైతం ఆన్ లైన్లలో మొబైల్స్, టీవీలు, ఫ్రిజ్ లు, ల్యాప్ టాప్ లు, స్టేషనరీ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చంటూ కేంద్రం తెలిపింది. సోమవారం నుంచి ఇది అమలులోకి రానుండగా ఒక్కరోజు ముందు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
Also Read : సుమక్క..సూపర్ 4..ఓసారి చూసేయండి..
లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో నిత్యావసర రహిత వస్తువులను ఆన్ లైన్ అమ్మేందుకు వీల్లేదంటూ కేంద్రం మళ్లీ బ్రేక్ వేసింది. అలాగే ఈ కామర్స్ డెలివరీలకు ఉపయోగించే వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది కేంద్రం. ప్రస్తుతానికి నిత్యావసరాలైన మందులు, ఆహార సంబంధిత వస్తువుల విక్రయాలు మాత్రమే జరపాలని సూచించింది.
Also Read : ఏపీలో 17కు చేరిన కరోనా మృతులు..