ఏపీలో 17కు చేరిన కరోనా మృతులు..

By రాణి  Published on  19 April 2020 6:51 AM GMT
ఏపీలో 17కు చేరిన కరోనా మృతులు..

ఏపీ కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 647 కేసులు నమోదవ్వగా అత్యధికంగా కర్నూల్ లో 158 కేసులున్నాయి. రాష్ట్రంలో శనివారం వరకూ 14 గా ఉన్న మృతుల సంఖ్య తాజాగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందడంతో ఆ సంఖ్య 17కి పెరిగింది. ఒకరు డిశ్చార్జ్ అవ్వగా మరో 153 మంది కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా బాధితులు, మృతుల వివరాలిలా..

గడిచిన 24 గంటల్లో అనంతపురంలో 3, ఈస్ట్ గోదావరిలో 5, గుంటూరులో 3, కృష్ణాలో 6, కర్నూల్ లో 26, విశాఖలో 1 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అనంతపురంలో 25, చిత్తూరు 24, ఈస్ట్ గోదావరి 16, గుంటూరు 125, కడప 18, కృష్ణా 66, కర్నూల్ 153, నెల్లూరు 65, ప్రకాశం 42, విశాఖపట్నం 5, వెస్ట్ గోదావరి జిల్లాల్లో 26 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 647 కేసులు నమోదవ్వగా 565 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. విజయవాడలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆదివారం నగరంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రధాన రోడ్లపై జనాలు కనిపించకపోయినప్పటికీ వీధుల్లో మాత్రం గుంపులుగానే తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రోన్ కెమెరాలో సహాయంతో వీధుల్లో నిఘా పెట్టారు. చికెన్, మటన్ షాపులతో పాటు కూరగాయలు, చేపల మార్కెట్లను సైతం మూసివేశారు.

Next Story