సుమక్క..సూపర్ 4..ఓసారి చూసేయండి..

By రాణి  Published on  19 April 2020 11:05 AM GMT
సుమక్క..సూపర్ 4..ఓసారి చూసేయండి..

ఈ కరోనా మనకు తెచ్చిపెట్టిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాలు బయట పెట్టావో కాటేస్తా అంటూ కాచుకుని కూర్చుంది. దాని నుంచి తప్పించుకుని పారిపోదామా అంటే..అది ఎలా ఉంటుందో..ఏ రూపంలో మనపై దాడి చేస్తుందో తెలీదు. ఆర్థికంగా నష్టపోయినా మానవ సంబంధాలను దగ్గర చేసింది. ముఖ్యంగా ఉద్యోగాలతో తల్లిదండ్రులు, చదువులతో బిజీ అయిన పిల్లల్ని మరింత దగ్గర చేసిందనే చెప్పాలి. అంతేకాక నలుగురికీ సహాయం చేయాలని, మనం శుభ్రంగా ఉండాలని ఇలా చాలా పాఠాలే నేర్పింది.

Also Read : ప్రార్థనలకు 100 మంది..లాక్ డౌన్ లో ఇదేమిటని అడిగితే..

కానీ ఇంకా ఎంతకాలం ఇంట్లో ఉండాలి. ఈ సమ్మర్ హాల్ డేస్ ఏదో మామూలు రోజుల్లో ఇస్తే ఎంచక్కా అమ్మా, నాన్నలతో కలిసి హాలిడే స్పాట్ లకు, సినిమాలు, షికార్లు తిరిగేవాళ్లం కదా అని ఆలోచించేవారూ ఉన్నారు. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందా ? అందుకే మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు సెలబ్రిటీలు ఇంట్లో నుంచే ప్రోగ్రామ్ లు చేస్తున్నారు. మొన్నీమధ్యే శ్రీముఖి, విష్ణుప్రియ, అవినాష్ కలిసి చేసిన బతుకు జట్కాబండి స్ఫూఫ్ బతుకు బలైపోయిన బండి ప్రోగ్రామ్ నెటిజన్లను అలరించింది. 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయ్ ఆ ప్రోగ్రామ్ కు. తాజాగా యాంకర్ సుమ కూడా సుమక్క సూపర్ 4 తో అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. యాంకర్లు రవి, ప్రదీప్, అనసూయ, రష్మీలతో కలిసి చేసిన ఆన్ లైన్ ప్రోగ్రాం సుమక్క..సూపర్ 4 ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంట్లోనే ఉండండి..సేఫ్ గా ఉండండి అని మెసేజ్ ఇచ్చేలా ఈ ప్రోగ్రామ్ చేశారు.

Also Read : నెటిజన్లను ఆకర్షిస్తోన్న ఢీ టీం కరోనా సాంగ్

ఇదొక్కటే కాదండోయ్..లాక్ డౌన్ ప్రకటించాక కరోనా సీజన్ లో లాక్ డౌన్ విత్ ఫ్యామిలీ, కరోనా సీజన్ లో మా ఆయన బంగారం పేరుతో వీడియోలు చేశారు. అంతేకాదు లాక్ డౌన్ లో సుమ తనకు వచ్చిన కేరళ స్టైల్ వంటకాలను కూడా నెటిజన్లకు పరిచయం చేస్తున్నారు.

Next Story
Share it