నెటిజన్లను ఆకర్షిస్తోన్న ఢీ టీం కరోనా సాంగ్

By రాణి  Published on  19 April 2020 8:42 AM GMT
నెటిజన్లను ఆకర్షిస్తోన్న ఢీ టీం కరోనా సాంగ్

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా పై ఇప్పటి వరకూ చాలా పాటలు వచ్చాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం బాగా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా చేతులెత్తి మొక్కుతా..చేయి చేయి కలపకురా, కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా..అనే సాంగ్ నెటిజన్లను బాగా ఆకర్షించింది. చౌరస్తా బ్రాండ్ రూపొందించిన ఈ పాటకు చాలా మంది సెలబ్రిటీలు అభినయించారు. టిక్ టాక్ లో కూడా ఈ పాటకు బాగా స్పందన వచ్చింది. కొన్నవేల మంది ఈ పాటకు అభినయిస్తూ టిక్ టాక్ చేశారు. ఇప్పుడు ఢీ టీం అంటే ఢీ కొరియోగ్రాఫర్స్ అండ్ కొంతమంది కంటెస్టంట్స్ కూడా ఈ పాటకు తమ స్టైల్ లో అభినయించారు.

Also Read : అంత్యక్రియలకు 50వేల మంది..ఉలిక్కిపడిన దేశం

బాబీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు యశ్వంత్, జావీద్, కృష్ణ, బాబీ, సోమేష్, నాని, గిరి, చెర్రీ, అభి, ప్రశాంత్, చైతన్య వారి వారి ఇళ్లలోనే ఉండి ఆన్ లైన్ వీడియో రూపొందించారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ ఇన్ స్టా గ్రామ్ లో వెల్లడించారు. యూ ట్యాబ్ లో బాబీ మాస్టర్ అప్ లోడ్ చేసిన ఈ వీడియో ఢీ అభిమానులతో పాటు..నెటిజన్లను సైతం ఆకట్టుకుంటోంది.

Next Story
Share it