అంత్యక్రియలకు 50వేల మంది..ఉలిక్కిపడిన దేశం

By రాణి  Published on  18 April 2020 5:18 PM GMT
అంత్యక్రియలకు 50వేల మంది..ఉలిక్కిపడిన దేశం

దేశమంతా కరోనా కారణంగా లాక్ డౌన్ పాటిస్తున్న వేళ ఓ మతపెద్ద అంత్యక్రియలకు ఏకంగా 50 వేల మంది హాజరయ్యారు. దీంతో బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. అవసరమేదైనా సరే..ఆఖరికి అంత్యక్రియలైనా పెద్దఎత్తున జనాలు గుమిగూడకూడదని చెప్పినా అవేమీ లెక్కచేయని వారు అంత్యక్రియలకు హాజరయ్యారు.

ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ విన్నపం

బంగ్లాదేశ్‌ ఖలీఫత్‌ మజ్లిస్‌ నయీబ్‌ ఈ ఆమిరైన మౌలానా జుబెయిర్‌ అహ్మద్‌ అన్సారీ (55) శుక్రవారం సరైల్‌ ఉపజిలాలోని బెర్తెలా గ్రామంలో మరణించారు. శనివారం స్థానిక మదర్సాలో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. అంత్యక్రియలకు తీసుకెళ్లే క్రమంలో నిర్వహించిన అంతిమయాత్రలో, ఆ తర్వాత అంత్యక్రియల్లో 50 వేల మంది పాల్గొన్నారు. ఇంతపెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోయినప్పటికీ ప్రజలు ఈ దుస్సాహసానికి ఒడిగట్టారు.

తీవ్ర భావోద్వేగంతో యాంకర్ ఉదయభాను ఫేస్ బుక్ పోస్ట్

కేవలం స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా వెల్లడించింది. ఇలా ఒకేసారి 50 వేల మంది ఓ కార్యక్రమంలో పాల్గొనటం అక్కడ చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఏ ఒక్కరికి కోవిడ్ 19 ఉన్నా అది వచ్చినవారందరికీ సోకే ప్రమాదముంది. బంగ్లాదేశ్ లో శనివారం వరకు 2,144 కోవిడ్ 19 కేసులు నమోదవ్వగా 66 మంది కోలుకున్నారు. మరో 84 మంది మృతి చెందారు.

Next Story