ప్రార్థనలకు 100 మంది..లాక్ డౌన్ లో ఇదేమిటని అడిగితే..
By రాణి Published on 19 April 2020 2:41 PM ISTప్రజలంతా ఒకే చోట గుమిగూడితే కరోనా వైరస్ సామాజిక వ్యాప్తికి దారి తీస్తుందన్న ఉద్దేశ్యంతో దేశంలోని అన్ని ప్రార్థనా మందిరాలను మూసివేశారు. అలాగే ఎక్కడా ఎలాంటి మతపరమైన కార్యకలాపాలను నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేశాయి. కానీ కొందరు ఈ విధమైన నియమ, నిబంధనలను ఏ మాత్రం పాటించడం లేదు. ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలతో తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఏకబిగిన పెరుగుతున్నాయి. తాజాగా..కృష్ణాజిల్లా పెడనలోని ఆర్ సీఎం చర్చిలో ఆదివారం ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలకు సుమారు 100 మంది హాజరైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన స్థానిక మీడియా చర్చి వద్దకు వెళ్లి లాక్ డౌన్ సమయంలో ఇలాంటి ప్రార్థనలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు.
Also Read : నెటిజన్లను ఆకర్షిస్తోన్న ఢీ టీం కరోనా సాంగ్
మీడియాతో మాట్లాడిన పాస్టర్..కరోనా పై చర్చించేందుకే ప్రార్థనలు నిర్వహించామని, కుటుంబానికి ఒక్కరిని మాత్రమే చర్చికి రమ్మన్నామంటూ బదులిచ్చారు. ప్రార్థనలు, పూజా కార్యక్రమాలు ఏవి ఉన్నా దేశం కరోనా నుంచి కోలుకునేంత వరకూ ఇళ్లలోనే చేసుకోండని చెప్పినా ప్రజలు ఏ మాత్రం ప్రభుత్వాలు, పోలీసుల మాటలను లెక్కచేయడం లేదనేందుకు తాజాగా జరిగిన ఈ ఘటన అద్దం పడుతోంది. శనివారం బంగ్లాదేశ్ లో సైతం ఓ మతపెద్ద అంత్యక్రియలకు ఏకంగా 50 వేల మంది ప్రజలు హాజరయ్యారు. ఈ ఘటనతో ఆ దేశం ఉలిక్కిపడింది.
Also Read : అంత్యక్రియలకు 50వేల మంది..ఉలిక్కిపడిన దేశం