కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ ఇంటి ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త నెల‌కొంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా ఎమ్మెల్యే ఇంటి ముట్ట‌డికి జ‌న‌సేన పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు జనసేన కార్యకర్తలు భానుగుడి సెంటర్‌ నుంచి ర్యాలీగా బయల్దేరి ద్వారంపూడి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.

జనసేన కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఘర్షణలో జనసేన, వైసీపీ కార్యకర్తలు ప‌ర‌స్ప‌రం రాళ్లు రువ్వుకున్నారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారండంతో పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డుకున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.