ప్రశాంతంగా దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Nov 2020 2:08 PM ISTదుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు పోటీలో ఉన్న అభ్యర్థులు ఉదయమే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ పోలీంగ్ స్టేషన్‌లలో ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు.
ఇదిలావుంటే.. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియలో భాగంగా లచ్చపేటలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు. అక్కడ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాగ, దుబ్బాక అసెంబ్లీ ఉప బరిలో 23 మంది అభ్యర్థులు ఉండగా.. ఈ నెల 10న ఎన్నికల ఫలితం తేలనుంది.
Next Story