చిన్న డ్రోన్ - పెద్ద ప్రమాదం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 1:40 PM GMT
చిన్న డ్రోన్ - పెద్ద ప్రమాదం..!

ఎక్కడో ఎడారి దేశంలో జరిగిన ఓ డ్రోన్‌ దాడి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది.సౌదీలోని చమురు క్షేత్రంపై హైతీ తీవ్రవాదులు చేసిన దాడి ప్రపంచ ఆయిల్ రంగంలో మంటలు పుట్టిస్తుంది. అంతేకాదు...మధ్య ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్మేలా చేసింది. అయితే..ఇక్కడ హైతీ తీవ్రవాదులకు డ్రోన్లు ఎవరు సరఫరా చేశారు..? ఎందుకు సరఫరా చేశారు? సౌదీలోని చమురు క్షేత్రాలపై దాడులు చేయమని హైతీ తీవ్రవాదులకు సలహా ఇచ్చిందెవరు..?

సౌదీలోని చమురు క్షేత్రంపై హైతీ తీవ్రవాదులు డ్రోన్లతో దాడి చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డ్రోన్లతో దాడి సులువైన మార్గమని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలుసార్లు రుజువైంది. క్లిపణులు కంటే డ్రోన్లు తక్కువ ఖరీదులో తయారీ అవుతాయి. చాలా తక్కువ కాలంలో డ్రోన్లను తయారు చేయవచ్చు. తక్కువ ఎత్తులో ఎగురుతూ..రాడార్లకు దొరక్కుండా చాలా ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి. అందుకే..హైతీ ఉగ్రవాదులు చమురు క్షేత్రాలపై దాడులకు డ్రోన్లను ఉపయోగించి ఉండవచ్చు.

హైతీ ఉగ్రవాదులు దాడి చేసిన చమురు క్షేత్రం అమెరికా సైనికుల రక్షణలో ఉంటుంది. చమురు క్షేత్రంలో క్షిపణి వ్యవస్త కూడా ఉంది. అయినా..ఎవరి రాడార్లకు చిక్కకుండా వచ్చిన హైతీ ఉగ్రవాదుల డ్రోన్లు తక్కువ సమయంలో బీభత్పం సృష్టించాయి. అయితే..ఇరానే హైతీ ఉగ్రవాదులకు డ్రోన్లను దొంగచాటుగా ఇచ్చిందని అమెరికా వాదిస్తుంది. చమురు క్షేత్రంపై దాడి చేసిన డ్రోన్లు ఇరాన్‌వే అని రుజువైతే ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.అయితే..తమ జోలికి వస్తే యుద్ధానికైనా రెడీ అంటూ ఇరాన్‌ కౌంటర్ ఇచ్చింది.

ఒక డ్రోన్ దాడి ఇప్పుడు ప్రపంచ దేశాల ఆర్ధిక స్థితిగతులను తారుమారు చేస్తుంది. ప్రపంచ దిగుమతులపై డ్రోన్‌ దాడి ప్రభావం చూపింది. ఒక్క డ్రోన్‌ దాడితో ప్రపంచ దేశాల్లో మరోసారి డ్రోన్లపై విస్తృత చర్చ జరుగుతుంది.

ఆఫ్టన్ యుద్ధంలో చాలా మంది తాలిబన్లను వారి నేతలను అమెరికా డ్రోన్ల ద్వారానే మట్టుపెట్టింది. ఇక..భారత్ కూడా ఎల్‌ఓసీ, పాక్,చైనా సరిహద్దుల్లో డ్రోన్లతో పహరా కాస్తుంది.అంతేకాదు..బంగాళాఖాతం, హిందూమహాసముద్రం, అరేబియా సముద్రాల్లో భారత్ నేవీ డ్రోన్ల సహాయంలో శత్రువులపై కన్నేసి ఉంచుతుంది. ఎల్‌ఎసీ అవతల ఉగ్రవాదుల లాంచ్ పాడ్‌ల గురించి కూడా మన ఆర్మీకి డ్రోన్లు చాలా విలువైన సమాచారాన్ని ఇస్తున్నాయి. అందుకే..భారత్ క్షిపణి వ్యవస్థ కంటే కూడా డ్రోన్ల మీదనే ఎక్కువ ఆధారపడుతుంది. ఇప్పటికే ఇజ్రాయిల్ డ్రోన్ల విషయంలో ప్రపంచ దేశాల కంటే ముందుంది.

డ్రోన్లను రక్షణ పరంగానే కాకుండా చాలా రకాలుగా కూడా వాడుకుంటున్నారు. ఫొటోగ్రఫీ, షూటింగ్‌, సరుకుల డెలివరీ.. తదితర రంగాల్లో విరివిగా వాడుతున్నారు. అయితే మిలటరీ ఆపరేషన్లలో కూడా ప్రయోగిస్తుండటంతో డ్రోన్ల మార్కెట్‌ వేలకోట్లకు చేరుకుంది. దేశ సరిహద్దుల్లో నిఘా నిమిత్తం, ఉగ్రవాదులపై దాడులకు సైతం వీటిని వాడుతుండటంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. ఒక్క డ్రోన్ దాడి ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రంగాన్నే కుదేలు చేస్తుంది. అందుకే..డ్రోన్‌ పై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతుంది.

Next Story