కరోనా వైరస్: పారాసిట్‌మల్‌పై డాక్టర్ సమరం ఏమన్నారంటే..!
By అంజి Published on 21 March 2020 5:12 PM ISTభారత్‌లో కరోనా వైరస్ కేసులు 298కి పెరిగాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నలుగురు కరోనా సోకి మృతి చెందారు. ఇక ప్రపంచ వ్యాప్తంగానైతే 10 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. అయితే కరోనా వ్యాధిని ఇలా నివారించవచ్చని, అలా నివారించవచ్చని ఎవరికీ వారు, ప్రముఖుల నుంచి సాధారణ వ్యక్తుల దాకా ఇష్టం వచ్చిన రీతిలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో కొందరు అసత్యాలు ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఎండలో నిల్చుంటే కరోనా రాదని, గోమూత్రం తాగితే కరోనాని నివారించవచ్చని ఇటీవల బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలు అయ్యారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంలు సైతం పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే కరోనా తగ్గిపొద్దని వ్యాఖ్యనించారు. వీరు ఈ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. కొందరు అసాధారణ, అశాస్త్రీయత కలిగిన సలహాలు ఇస్తూ తీవ్ర విమర్శల పాలు అవుతున్నారు.
Also Read: కరోనా.. అతడికి గతాన్ని గుర్తుకు తెచ్చింది!
అయితే తాజాగా కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం మాట్లాడారు. కరోనా వైరస్‌కు పారాసిటమాల్ విరుగుడు కాదని ఆయన అన్నారు. అసలు ఈ వైరస్‌కు మందులే లేవని ఆయన అన్నారు. ఎయిడ్స్, మలేరియా వంటి వ్యాధుల చికిత్స కోసం ఉపయోగించే వివిధ రకాల మందులను కరోనా వ్యాధి నియంత్రణకు ఉపయోగిస్తున్నారని అన్నారు. అయితే వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవన్నారు. ఇక కరోనా వైరస్‌కు మంద కనిపెట్టారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా వదంతులు మాత్రమేని చెప్పారు. అయితే కొందరు కరోనాపై పూర్తిగా అవగాహన లేకుండా ఏదేదో అనేస్తున్నారని డాక్టర్ సమరం అసంతృప్తి వ్యక్తం చేశారు. పారాసిటమల్ ఈ వైరస్ నివారణకు మందు కాదన్నారు. కరోనా వైరస్ మందులు గురించి చెప్పే బాధ్యత వైద్యులదని.. అది సాధారణ వ్యక్తుల బాధ్యత కాదన్నారు. అసలు మందులే లేనప్పుడు పారాసిటమల్‌తో తగ్గిపోతుంది, దీనితో తగ్గిపోతుంది, దానితో తగ్గిపోతుందని ఎలా చెబుతారని డాక్టర్ సమరం అన్నారు.