జబర్ధస్త్ షోలో దొరబాబు రీ ఎంట్రీ..! కండిషన్స్‌ అప్లై అన్న హైపర్‌ ఆది..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2020 6:58 PM IST
జబర్ధస్త్ షోలో దొరబాబు రీ ఎంట్రీ..! కండిషన్స్‌ అప్లై అన్న హైపర్‌ ఆది..!

జబర్దస్త్‌ షో ద్వారా కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దొరబాబు. కాని ఒక్క పనితో పరువంతా పోయింది. ఇటీవల విశాఖలో ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది ఎవరికి క్లారిటీ లేదు. దొరబాబు నిజంగానే వ్యభిచారం చేస్తూ పట్టుపడ్డాడా.. కాదు కాదు.. కావాలనే ఆయన్ని ఈ కేసులో ఇరికించారని మరికొందరు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. దొరబాబు భార్య మాత్రం మా ఆయన ఏంటో నాకు తెలుసు. అలాంటి తప్పు చేసి ఉండడు అంటోంది.

ఏది ఏమైనా దొరబాబు పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుంది.

అసలు ఆ రోజు పోలీసులు అరెస్ట్‌ చేయడానికి వచ్చింది దొరబాబును కాదని సమాచారం. అసలు అక్కడ ఆయన ఉన్నట్లు కూడా ఎవరికి పెద్దగా సమాచారం లేదట. ఏదో పని నిమిత్తం విశాఖకు వచ్చిన దొరబాబు, పరదేశీని అక్కడ ఉన్న ఓ ఫ్రెండ్‌ ఆ చోటికి తీసుకెళ్లాడనే వార్తలు కూడా వినవస్తున్నాయి. అయితే వ్యభిచారం జరుగుతున్న పక్కప్లాట్‌లోకి కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రైడింగ్‌ చేసేందుకు వచ్చారని, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న ఓ వ్యక్తి లోపల జబర్దస్త్‌ కమెడియన్‌ ఉన్నాడని పోలీసులకు చెప్పడంతో అనుమానం వచ్చి అసలు ఏం జరుగుతుందని పేకాట రాయుళ్లతో పాటు పక్కనే ఉన్న ఈ ప్లాట్‌లోకి కూడా పోలీసులు వెళ్లారని తెలుస్తోంది.

కానీ ఎవ్వరు ఊహించని విధంగా అక్కడ వ్యభిచారం జరుగుతుండటంతో సీన్‌ అంతా రివర్స్‌ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే అసలు అక్కడ దొరబాబు, పరదేశీ ఉన్నారని పోలీసులకు కూడా తెలియదని అక్కడున్నవాళ్లు కొందరు చెబుతున్నమాట. పేకాట ఆడుతున్న వాళ్ల కోసం వచ్చిన పోలీసులకు జబర్దస్త్‌ కమెడియన్లు కూడా అడ్డంగా దొరికిపోయారు.

హైపర్‌ ఆది చొరవతో..

ఈ సంఘటనతో దొరబాబును బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందట మల్లెమాల టీం. అయితే హైపర్‌ ఆది కలగజేసుకుని మల్లెమాల టీంలో మాట్లాడాడు. వాళ్లని కన్విన్స్‌ చేసినట్లు సమాచారం. అతడు తెలిసి చేసినా.. తెలియక చేసినా.. ఇకపై ఎలాంటి వివాదాలకు పోనని హామి ఇస్తేనే అతన్ని తీసుకుంటామని జబర్దస్త్ టీం చెప్పారట. ఒకవేళ అతను పట్టుపడితే.. హైపర్ ఆది కూడా షో నుంచి తీసేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే హైపర్‌ ఆది స్కిట్‌లలో దొరబాబు కనిపించనున్నాడట. మరీ ప్రేక్షకులు దొరబాబు ఇంతక ముందులా ఆదరిస్తారో లేదో వేచి చూడాలి.

Next Story