అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'ఏ పిల్లా పరుగున పోదామా.. ఏ వైపో జంటగ ఉందామా.. రారా కంచే దూకి చకచక.. ఉరుకుతూ ఆ రంగుల విల్లుని తీసి నీ వైపు వంతెన వేసి రావా' అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు పవన్‌ సిహెచ్‌ చక్కటి సంగీతం అందించాడు. ఈ పాటకు సాహిత్యం అందించినవారు చైతన్య పింగళి. పాడినవారు హరిచరణ్. స్లో సాంగ్స్.. మెలోడీస్ ఇష్టపడేవారికి నచ్చుతుంది.

ఫిదా తర్వాత శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా ఇది. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళీ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా వేసవి కానుకగా ఏప్రిల్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

వంశికుమార్ తోట

Next Story