ట్రంప్‌తో సన్నీలియోన్‌.. అలా అయితేనే..

By అంజి  Published on  22 Feb 2020 12:42 PM GMT
ట్రంప్‌తో సన్నీలియోన్‌.. అలా అయితేనే..

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. మరోసారి తన ట్వీట్‌తో సంచలనం రేపారు. ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వర్మ.. ఎప్పుడూ ఎవరిని టార్గెట్‌ చేస్తారో ఎవరికి తెలియదు. అయితే ఈ సారి రామ్‌గోపాల్‌ వర్మ.. ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను టార్గెట్‌ చేశారు. ఇప్పటికే ట్రంప్‌ భారత పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ట్రంప్ భారత పర్యటనపై రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్విటర్‌ వేదికగా స్పందించారు.

ఈ నెల 24న ట్రంప్‌ తన భార్య, సలహాదారులు ఇవాంకా ట్రంప్‌, జారేద్‌ కుష్కర్‌తో కలిసి భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌ రోడ్‌ షోతో పాటు నమస్తే ట్రంప్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రెండు కార్యక్రమాల్లో ట్రంప్‌ పాల్గొననున్నారు. అయితే రోడ్‌ షోలో తనకు స్వాగతం పలికేందుకు మిలియన్ల మంది ప్రజలు వస్తారని ట్రంప్‌ ఈ మధ్య ఓ సమావేశంలో అన్నారు. కోటి మందితో ట్రంప్‌కు స్వాగతమన్న వర్మ.. ట్రంప్‌ పర్యటనపై తనదైన శైలిలో స్పందించారు.

కోటి మంది ట్రంప్‌కు స్వాగతం పలకాలంటే.. ఆయనతో పాటు బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, అమిర్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, దీపికా పదుకునెలతో పాటు కత్రినా కైఫ్‌, సన్నీలియోన్‌లకు స్టేజీ అవకాశం కల్పించాలన్నారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. వర్మ ట్వీట్‌పై తన అభిమానులు వారి బుర్రకు పని చెప్పుకుంటున్నారు. కాంట్రవర్సీల్‌ కింగ్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్మకు.. పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. వర్మ లాగానే మాట్లాడాలని, చేయాలని చాలా మంది ఆలోచించే వారు కూడా ఉన్నారు.



ఈ నెల 24, 25 తేదీల్లో భార్య మెలానియాతో కలిసి ఆయన ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో పర్యటిస్తారు. భారత పర్యటనలో డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆగ్రాకూ వెళ్లనున్నారు. ఆయన తన భార్యతో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. ఈ నెల 24న ట్రంప్‌ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ట్రంప్‌కు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి 22 కి.మీ మేర రోడ్‌ షో కొనసాగనుంది. రోడ్‌ షోలో భారీ సంఖ్యలో ప్రజలు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి సబర్మతి ఆశ్రమానికి వెళ్తారు. ఆ తర్వాత క్రికెట్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.

Next Story