తప్పును కప్పిపుచ్చుకునేందుకు.. భార్య శాంపిల్స్‌ను పనిమనిషి పేరుతో..
By తోట వంశీ కుమార్ Published on 12 July 2020 1:45 PM ISTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇలాంటి తరుణంలో డాక్టర్లు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే.. ఓ డాక్టర్ చేసిన నిర్వాకం వల్ల అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు భార్య శాంపిల్స్‌ను పనిమనిషి పేరు మీద పంపి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సింగ్రౌలి ప్రాంతంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ వైద్యుడు పనిచేస్తున్నాడు. పై అధికారులు సెలవు ఇవ్వకున్నా.. ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెళ్లికి వెళ్లారు. జూన్ 23న వివాహానికి హాజరై.. జూలై 1న తిరిగి ఇంటికి వచ్చారు. కరోనా నిబంధనల ప్రకారం హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా విదులకు హాజరయ్యాడు. కాగా.. అతడి భార్యలో కరోనా లక్షణాలు కనిపించాయి. ఆమెకు పరీక్షలు నిర్వహిస్తే.. తాను ఉత్తరప్రదేశ్‌కి వెళ్లి వచ్చిన విషయం ఎక్కడ బయటపడుతుందని బావించాడు. తన శాంపిల్స్‌ని ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి పేరు మీద పంపాడు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అధికారులు వివరాల ప్రకారం పనిమనిషి ఇంటికి వెళ్లగా.. వైద్యుడి బాగోతం బయటపడింది.
అతడి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. అతడితో పాటు మరో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వారిందరిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుడిపై పోలీలసులు కేసు నమోదు చేశారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఇతరుల పేరు మీద శాంపిళ్లను పంపినందుకు ఆ డాక్టర్‌పై ఎపిడమిక్ చట్టం కింద కేసు నమోదు చేశారు. డాక్టర్‌కి పాజిటివ్‌గా తేలడంతో.. అతడు పనిచేసే చోట ఉన్న 33 మంది ఐసోలేషన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.