హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. నగర ప్రజల దాహార్తి తీరుస్తున్న గోదావరి జలాల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇవాళ ఉదయం నుంచి నీటి సరఫరా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ప్యాకెజీ-13లో భాగంగా గ్రావిటీ కెనాల్‌ నిర్మాణం జరుగుతుంది. ఈ క్రమంలో గజ్వేల్‌ మండలంలోని కోడకండ్ల గ్రామం వద్ద నగరానికి వచ్చే నీటి పైపులైన్‌లు అడ్డుగా వస్తున్నాయి. పైప్‌లైన్‌ను వేరే చోటుకు మార్చే క్రమంలో 48 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు. నీటి సరఫరా నిలిచిపోనున్న నేపథ్యంలో పలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నీటిసరఫరా నిలిచిపోనున్న ప్రాంతాలు

ఎర్రగడ్డ, ఎల్లారెడ్డిగూడ, బోరబండ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, మూసాపేట, కేపీహెచ్‌బి, భాగ్యనగర్‌, బాలానగర్‌, భరత్‌నగర్‌, చింతల్, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, సురారం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్‌, ప్రశాంత్‌ నగర్‌, చాణక్యపురి, మల్కాజిగిరి, అల్వాల్‌, నిజాంపేట, ప్రగతినగర్‌, బాచుపల్లి, చందానగర్‌, లింగంపల్లి, ఆర్‌సీపురం, తార్నాక, మౌలాలీ, పోచారం, తుర్కపల్లి, కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడింది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story