ఇన్‌స్టాలో అమ్మడి ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

By అంజి  Published on  5 Feb 2020 11:30 AM GMT
ఇన్‌స్టాలో అమ్మడి ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

దిశా పటానీ.. ఈ బాలీవుడ్ హాట్ లేడీకి ఇన్‌స్టా గ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్. ఈ అమ్మడు అలా ఒక పోస్టు పెట్టడం ఆలస్యం.. నిముషాల్లో లక్షల లైక్స్.. ఇక ఆమె ఫోటో షూట్స్ పై యువత ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తూ ఉంటుందనుకోండి. అందుకే ఆమెకు ఈ ఫోటో షేరింగ్ యాప్ లో ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఫాలోవర్స్ సంఖ్య 30 మిలియన్లను దాటింది.

Disha patani instagram

ఓ బాలీవుడ్ నటికి ఈ స్థాయిలో ఫాలోవర్స్ రావడం అరుదైన విషయమే..! 30 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ రావడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన ఇన్ స్టా ఫ్యామిలీకి థాంక్స్ చెప్పుకొచ్చింది దిశా. తనను మొదటి నుండి సపోర్ట్ చేస్తూ వచ్చిన ఫాలోవర్స్ కు పెద్ద థాంక్స్ అనీ.. తన ప్రయాణంలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆమె చెప్పుకొచ్చింది.

Disha patani instagram

మోహిత్ సూరి దర్శకత్వంలో దిశా పటానీ నటించిన 'మలంగ్' సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఇప్పటికే సాంగ్స్ హిట్ అవ్వగా.. ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలున్నాయి. అలాగే ఈ సినిమాలో తనకు మలంగ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన మోహిత్ సూరికి ధన్యవాదాలు తెలిపింది. మలంగ్ చిత్రంలో తన కో స్టార్స్ గా నటించిన అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, కునాల్ ఖేము, ఎల్లి అవరమ్ లు 'ది బెస్ట్ కో స్టార్స్' అంటూ కితాబు ఇచ్చింది. దిశా పటానీ తెలుగులో 'లోఫర్' సినిమాలో నటించింది. ఎం.ఎస్. ధోనీ బయోపిక్ ద్వారా దిశా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్ తో బాఘీ, సల్మాన్ ఖాన్ తో భరత్ సినిమాల్లో నటించింది.

Next Story
Share it